Last Updated:
ఏదైనా సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వస్తే, ఆ తర్వాత అవార్డులు రావడం కామన్. కానీ ఒక మూవీ రిలీజ్ కాకముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన ఈ సినిమా, రిలీజ్‌కు ముందే 6 అవార్డులు సొంతం చేసుకుంది.
ఏదైనా సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వస్తే, ఆ తర్వాత అవార్డులు రావడం కామన్. కానీ ఒక మూవీ రిలీజ్ కాకముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన ఈ సినిమా, రిలీజ్‌కు ముందే 6 అవార్డులు సొంతం చేసుకుంది. త్వరలో ఓటీటీలోకి రిలీజ్ కానున్న ఆ మూవీ పేరు ‘స్టోలెన్’ (Stolen). కరణ్ తేజ్‌పాల్ తెరకెక్కించిన ఈ మూవీ వచ్చే వారం OTTలో రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. 2023లోనే వివిధ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.
ఇంట్రెస్టింగ్ స్టోరీ
స్టోలెన్ అనేది ఇద్దరు అన్నదమ్ముల కథ. గ్రామీణ ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లడం ఈ ఇద్దరు అన్నదమ్ములు చూస్తారు. ఓ సోదరుడు జాలి పడి ఆ బిడ్డను వెతుకుతున్న తల్లికి సహాయం చేద్దామని మరో సోదరుడిని ఒప్పిస్తాడు. దీంతో ఆ మహిళతో కలిసి వారిద్దరూ ఆ చిన్నారిని వెతకడం మొదలు పెడతారు. ఈ క్రమంలో వారు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటారు. చివరికి ఆ చిన్నారిని కనిపెట్టారా? ఆ బిడ్డను ఎవరు, ఎందుకు ఎత్తుకెళ్లాల్సి వచ్చింది? వంటి విషయాలు సినిమా స్టోరీలైన్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. మిగతా కథేంటో పూర్తిగా తెలుసుకోవాలంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే.
రిలీజ్‌కు ముందే అవార్డులు
ఈ సినిమా ఇంకా విడుదల కాకపోయినప్పటికీ వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ (Film Festivals)లో ప్రదర్శించారు. అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది. ముందు 2023 వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ (Venice Film Festival)లో ఈ మూవీని ప్రజెంట్ చేశారు. దీంతో క్రిటిక్స్, వ్యూయర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Beijing International Film Festival)లో ఈ మూవీ 3 అవార్డులను అందుకుంది. ఈ సినిమాకు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ నటి ప్రైజ్‌లు వచ్చాయి.
జపాన్ స్కిప్ సిటీ ఇంటర్నేషనల్ డి-సినిమా ఫెస్టివల్ (Japan’s Skip City International D-Cinema Festival)లో బెస్ట్ సినిమా అవార్డుతో పాటు బెస్ట్ డైరెక్టర్ విభాగంలో అవార్డు అందుకుంది. జురిచ్ ఫిల్మ్ ఫెస్టివల్ (Zurich Film Festival)లో స్టోరీ టెల్లింగ్‌కి ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
విడుదలకు రెడీ
అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సత్తా చాటిన ఈ ‘స్టోలెన్’ మూవీ ఫైనల్‌గా డిజిటల్ డెబ్యూ ఇవ్వడానికి రెడీ అవుతోంది. 2025, జూన్ 4న ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రిలీజ్ అవుతుంది. అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee), హరిష్ ఖన్నా (Harish Khanna), మియా మాల్జర్ (Mia Malzer), సాహిదుర్ రెహ్మాన్ (Sahidur Rahman), శుభం (Shubham) ఇందులో కీలక పాత్రలు పోషించారు. కరన్ తేజ్‌పాల్ (Karan Tejpal)కి డైరెక్టర్‌గా ఇది ఫస్ట్ మూవీ.
Hyderabad,Hyderabad,Telangana