Press "Enter" to skip to content

Singer Mangli: సింగర్‌ మంగ్లీ బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి

చేవెళ్ల గ్రామీణం: సింగర్‌ మంగ్లీ (Singer Mangli) బర్త్‌డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి లభ్యమయ్యాయి. పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని రిసార్టులో స్నేహితులకు మంగళవారం రాత్రి ఆమె పార్టీ ఇచ్చారు.

ఈ వేడుకలకు సుమారు 50 మంది వరకు మంగ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలో రాత్రి 2 గంటల సమయంలో ఎస్‌వోటీ పోలీసులు రిసార్టుపై దాడులు చేశారు. సింగర్‌ మంగ్లీ, పార్టీ నిర్వాహకుడు, రిసార్ట్‌ నిర్వాహకుడు, టెస్టుల్లో గంజాయి పాజిటివ్‌గా తేలిన ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై అనుమతి లేకుండా పార్టీ నిర్వహణ, న్యూసెన్స్‌ కేసులు నమోదయ్యాయి.

Source link