వెంకటేశ్ గురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ, రియల్ కిక్ బాక్సర్ రితికా సింగ్ (Ritika Singh) ఆ తర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసి పూర్తిగా కనుమరుగైంది. ఆపై ఎక్కువగా తమిళ సినిమాల్లోనే కోలీవుడ్‌లో ఇరుది చుట్రు, అండవన్ కట్టలై, శివలింగా, ఓ మై కడవులే, మళై పిడిక్కాద మణిదన్స సినిమాలతో పాటు చివరగా రజనీకాంత్ వేట్టెయన్లో పోలీసాఫీసర్‌గా మెప్పించిన ఉత్తరాది భామ రితికా సింగ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అయినా సినీ అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమవుతున్న ఈ బ్యూటీ అందాల ఆరబోతలో మాత్రం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. నిరంతరం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే రితిక.. కొన్ని రోజుల క్రితం మరింత నాజూగ్గా మారి గ్లామర్ డోస్ పెంచి మరీ రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తు కుర్రకారును కవ్విస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు చేసిన ఫొటోషూట్లను తలదన్నేలా, తన ఫాలోవర్స్ ఖంగు తినేలా హాట్ హాట్ ఫోజులతో షాకిచ్చింది.
బాత్ రూం, కిచెన్, బెడ్ రూం రకరకాల ప్లేస్‌లలో వివిధ భంగిమల్లో ఫోజులిస్తూ హోయలు పోయింది. ఈ చిత్రాలు చూసిన వారంతా.. రితిక ఏంటి ఇంతగా చేంజ్ అయింది, చూస్తున్నది నిజమేనా అనుకుంటున్నారు.
అంతేకాదు తోటి హీరోయిన్లు ఇషా రెబ్బా, రుహానీ శర్మ, షాలినీ పాండే, శివాత్మిక, ఫరియా అబ్దుల్లా వంటి సౌత్ హీరోయిన్లు వావ్.. సూపర్ హాట్ గర్ల్ అంటూ కామెంట్లతో రితిక రితికా సింగ్ (Ritika Singh) అందాన్ని ఆకాశానికెత్తేశారు.
ఈ విషయంపై రితికా సింగ్ స్పందిస్తూ, ‘గత కొన్ని రోజులుగా నా బరువుపై ఎంతో ఆందోళన చెందా. నన్ను అద్దంలో చూసుకుని, ఇప్పు టివరకు కనిపించని విధంగా నాజూగ్గా మారాలని భావించాను. అందుకోసం ఆహార నియమాలతో పాటు కఠోర వ్యాయామాలు చేశాను. ఇది ఎంతగానో ఫలించింది. ఇప్పుడు నేను ఊహించిన దాని కంటే ఎక్కువ ఫలితమిచ్చింది’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ రితికా సింగ్ (Ritika Singh) అమ్మడి ఫొటోలు సోషల్ మీడియాలో బాగా హాల్ చల్ చేస్తున్నాయి మీరూ ఓ లుక్కేసి ఆస్వాదించండి.
Updated Date – Jun 22 , 2025 | 11:54 AM