Press "Enter" to skip to content

OTT Movies: స్ట్రీమింగ్‌కు సిద్ధమైన థ్రిల్లర్‌ మూవీస్‌.. ఏ సినిమా ఏ ఓటీటీలో అంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్‌ చేసేందుకు ఇప్పటికే కొన్ని సినిమాలు సిద్ధం కాగా తాజాగా మరో రెండు చిత్రాల స్ట్రీమింగ్‌ వివరాలు వెల్లడయ్యాయి. అవే ‘బ్లైండ్‌ స్పాట్‌’ (Blind Spot), ‘కార్తీక: మిస్సింగ్‌ కేస్‌’ (Karthika Missing Case). ఈ రెండూ ఈ నెల 13న రిలీజ్‌ కానున్నాయి.

నవీన్‌ చంద్ర (Naveen Chandra), రాశీసింగ్‌ (Rashi Singh) ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాకేశ్‌ వర్మ తెరకెక్కించిన సినిమా ‘బ్లైండ్‌ స్పాట్‌’. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా మేలో థియేటర్లలో విడుదలైంది. శుక్రవారం నుంచి ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ కానుంది. వివాహిత మృతి కేసును విక్రమ్‌ అనే పోలీసు అధికారి ఎలా ఛేదించాడన్న పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది.

  • మరో ఓటీటీలోకి ‘ఆ ఒక్కటీ అడక్కు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

గతంలో బాక్సాఫీసు ముందుకొచ్చి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న తమిళ్‌ సినిమా ‘యుగి’ (Yugi). శుక్రవారం నుంచి ఓటీటీ ‘ఆహా’ (Aha)లో ‘కార్తీక: మిస్సింగ్‌ కేస్‌’ టైటిల్‌తో తెలుగులో స్ట్రీమింగ్‌ కానుంది. కథిర్‌, నరైన్‌, జోజూ జార్జ్‌, ఆనంది తదితరులు నటించిన ఈ మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ మూవీకి జాక్‌ హారిక్‌ దర్శకత్వం వహించారు. కార్తీక అనే అమ్మాయి మిస్సింగ్‌ కేసును ఛేదించే క్రమంలో ఓ డిటెక్టివ్‌ బృందానికి ఎదురైన సవాళ్లేంటన్నది క్షుప్తంగా ఈ సినిమా కథాంశం.

Source link