02 Jul 2025 | 16:23 IST
స్వచ్ఛందగానే రాజీనామా చేశా: ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్
అమరావతి: రాజీనామాపై ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ వివరణ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛందగానే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఒత్తిళ్లతో రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. ఇన్నాళ్లు ఏపీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.